Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2017 12:37:41
facebook Twitter Googleplus
Photo

వరుణ్ తేజ్ తో కలిసి క్రిష్ డైరెక్షన్ లో కంచె మూవీలో మెప్పించిన తర్వాత.. ప్రగ్యా జైస్వాల్ పేరు మార్మోగిపోయింది. అనేక ప్రాజెక్టులలో ఈ భామ పేరు తెగ వినిపించేసింది. అవకాశాలు బోలెడన్ని వచ్చేశాయి. ఇంత క్రేజ్ ఉన్నా.. గతేడాది ఒక్క సినిమా కూడా ఈ భామ నటించిన మూవీ రిలీజ్ కాలేదంటే.. సిట్యుయేషన్ అర్ధమవుతుంది

అయితే.. 2017లో మాత్రం అమ్మడి కెరీర్ పరుగులు పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వరుసగా ఈమె నటించిన సినిమాలు రిలీజ్ కి సిద్ధమైపోతున్నాయి. ఈ వారంలో నాగార్జున-రాఘవేంద్రరావుల మూవీ ఓం నమో వేంకటేశాయ రిలీజ్ కానుంది. దీనిపై అమ్మడి ఆశలు చాలానే ఉన్నాయి. ఆ తర్వాత గుంటూరోడు అంటూ మంచు మనోజ్ తో కలిసి ఈ నెలలోనే ప్రేక్షకులను పలకరించనుంది ప్రగ్యా. వీటితో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న నక్షత్రం చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న ఈ భామ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిస్తున్న సినిమాలోనూ నటిస్తోంది.

ఈ చిత్రాలు అన్నిటిలోను తన పాత్రలు విభిన్నంగా ఉంటాయని చెబుతోంది ప్రగ్యా జైస్వాల్. 'రెగ్యులర్ సినిమాల కంటే.. వచ్చి అవకాశాలు అన్నీ ఉపయోగించేసుకోవాలని అనుకోవడం కంటే.. విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకోవడానికే నేను ప్రాముఖ్యత ఇస్తాను' అని చెబుతోంది ప్రగ్యా జైస్వాల్.

,  ,  ,  ,  ,