Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2017 12:28:26
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ 161 చిత్రం పేరును డిసైడ్ చేసేశారు. పా. రంజిత్ డైరెక్షన్ లో తలైవా మరో సినిమా చేయటానికి ఓకే చెప్పేయటం తెలిసిందే. ఈ చిత్రానికి ఏం పేరు పెడతారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఆ ఉత్కంటను తీరుస్తూ.. తాజాగా ఆ చిత్రానికి కాలా పేరును ఖరారు చేసినట్లుగా రజనీ అల్లుడు.. చిత్ర నిర్మాత.. నటుడు ధనుష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ధనుష్ తన వండర్ బార్ ఫిలిమ్స్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ సరసన బాలీవుడ్ నటి ఖురేషీ హ్యూమా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో దర్శక నటుడు సముద్రగని నటిస్తున్నట్లుగా చెబుతున్నారు. 2018లో విడుదలయ్యే ఈ సినిమాకు సంతోష్ నారాయణ మ్యూజిక్ ఇవ్వనున్నారు.

,  ,  ,  ,  ,  ,