Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2017 11:15:45
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ సినిమా మన రాష్ట్రం అవతల కూడా క్రేజ్ తెచ్చుకోవడం.. భారీ అంచనాల మధ్య విడుదలవుతుండటం మన జనాలకు ఆశ్చర్యమేమీ కలిగించట్లేదు. కానీ ఈ చిత్రం విదేశాల్లో సైతం అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుని.. అక్కడి ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకర్సిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ప్రకంపనలు రేపుతోంది. దుబాయ్ లో బాహుబలి: ది కంక్లూజన్ కు సంబంధించి ఇప్పటిదాకా లక్షకు పైగా టికెట్ల అమ్మకం జరిగిందట.

ఈ విషయాన్ని బాహుబలి-2ను గల్ఫ్ దేశాల్లో విడుదల చేస్తున్న ఫార్స్ ఫిలిమ్స్ అధినేత గులాన్ వెల్లడించాడు.దుబాయ్ లో బాహుబలి టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అతనీ సంగతి చెప్పాడు. కిందట విడుదలైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8 సినిమాకు కూడా ఇన్ని టికెట్లు అమ్మలేదని గులాన్ చెప్పడం విశేషం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లోని సినిమాలకు ఉండే క్రేజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ఈ చిత్రం విడుదలై పది రోజులవుతున్నా.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా బాహుబలి-2కు అమ్మిన టికెట్ల కంటే తక్కువ టికెట్లే అమ్ముడయ్యాయంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.

,  ,  ,  ,  ,