Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 12:23:50
facebook Twitter Googleplus
Photo

నలుగురు యువ హీరోలతో ఇప్పటికే నిండుగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని తెగ ఆకర్షిస్తోంది శమంతకమణి పోస్టర్. ఇప్పుడు ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 3న హైదరాబాద్ లో శమంతకమణి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఆ వేడుకకి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. భవ్య ప్రొడక్షన్స్ సంస్థలో తెరకెక్కుతున్న చిత్రం కావడం ఆ సంస్థలోనే ప్రస్తుతం బాలయ్య పైసా వసూల్ చిత్రం చేస్తుండడంతో నిర్మాతల ఆహ్వానం మేరకు ఆయన శమంతకమణి ఈవెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ వేడుకకి పూరి జగన్నాథ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.

ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటించడమే గగనమనుకొనే ఈ పరిస్థితుల్లో ఏకంగా నలుగురు హీరోలు కలిసి నటించడమంటే మాటలు కాదు. కథలో ఎంతో బలముంటే తప్ప హీరోలు అలా కలిసి నటించడానికి ఒప్పుకోరు. భలే మంచి రోజు తో హిట్టు కొట్టిన శ్రీరామ్ ఆదిత్య రాసిన స్క్రిప్టువల్లే శమంతకమణి కోసం నలుగురు హీరోలు చేతులు కలిపారని చెప్పొచ్చు. ఇప్పటికే నిండుగా కనిపిస్తున్న పోస్టర్ వల్ల సినిమాకి మంచి బజ్ కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకొంటోంది. ఇక బాలయ్య కూడా రంగంలోకి దిగాడంటే సినిమా ప్రమోషన్ పీక్స్కి వెళుతుందనడంలో సందేహం లేదు. భారీ చిత్రాల్ని తీయగల సామర్థ్యమున్న భవ్య క్రియేషన్స్కి శమంతకమణి పైసావసూల్ చిత్రాలు చాలా కీలకం.

,  ,  ,  ,  ,  ,  ,