Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2015 12:45:13
facebook Twitter Googleplus
Photo

'అత్తారింటికి దారేది' సినిమా నుంచి సక్సెస్ బాటలో పయనిస్తున్న కన్నడ కస్తూరి ప్రణీత, తాజాగా తెలుగులో ఓ భారీ ఆఫర్ చేజిక్కించుకుంది. అగ్రనటుడు బాలకృష్ణ సరసన నటించే చాన్స్ సొంతం చేసుకుంది. శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'డిక్టేటర్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో నటించే ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా అంజలిని ఇప్పటికే ఎంపిక చేశారు. మరో కథానాయిక పాత్రకు తాజాగా ప్రణీతను బుక్ చేసినట్టు సమాచారం. కోన వెంకట్, గోపీమోహన్ రచన చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 20 నుంచి జరుగుతుంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,