Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2017 10:11:36
facebook Twitter Googleplus
Photo

ప్రవీణ్ సత్తారు గతేడాది గుంటూరు టాకీస్ మూవీతో పెద్ద సెన్సేషన్ నే సృష్టించాడు. ఇప్పుడు పీఎస్వీ గరుడవేగ అంటూ రాజశేఖర్ తో భారీ బడ్జెట్ మూవీని రూపొందించగా.. ఈ శుక్రవారమే ఈ చిత్రం రిలీజ్ కానుంది. 10 ఏళ్ల క్రితం తన మనసులో పుట్టిన ఓ కథకు ఇప్పుడు దృశ్యరూపం ఇచ్చానంటున్నాడు ప్రవీణ్ సత్తారు.

ఈ సినిమా బడ్జెట్ విషయంలో చాలానే మాటలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ హీరోగా రూపొందిన సినిమాకు ఏకంగా 25 కోట్ల బడ్జెట్ కేటాయించడం అంటే అదో పెద్ద సాహసంగా అందరూ అడుగుతున్నారు. 'అసలు ఎక్కడకు వెళ్లినా ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో అర్ధం కాని విషయం. కొత్త దర్శకుడు.. అంతగా ఫేమ్ లేని హీరోతో అర్జున్ రెడ్డి రూపొందించాడు. ఇందుకు 4 కోట్లు ఖర్చయింది. కానీ ఆ మూవీ 30 కోట్లకు పైగా రాబట్టగలిగింది. కథలో కంటెంట్ ఉంటే.. డబ్బులు కలెక్షన్స్ రూపంలో అవే వస్తాయి'అంటున్నాడు ప్రవీణ్ సత్తారు. అసలు బడ్జెట్ గురించిన మాటలు మాట్లాడడం తనకు సంబంధం లేని విషయం అన్నది ఈ దర్శకుడి వాదన.

ఓ కథ ఓ నిర్మాతకు చెప్పినపుడు.. ఎంత ఖర్చవుతుందని అని నిర్మాత అడగడం అంటే అదో స్టుపిడ్ క్వశ్చన్ అనేస్తున్నాడు ప్రవీణ్ సత్తారు. ఇది లైన్ ప్రొడ్యూసర్ చూసుకునే విషయమని చెప్పిన ఈ కుర్ర డైరెక్టర్ తేల్చేస్తున్నాడు.

,  ,  ,  ,