Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2016 11:03:17
facebook Twitter Googleplus
Photo

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రయోగాలను ఎక్కువగా ప్రోత్సహించే నటుల్లో ?కమల్ హాసన్? తరువాత హీరో ?విక్రమ్? ముందుంటాడు. శివపుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాలన్నీ ఆయనకు ఆ పేరును తెచ్చిపెట్టాయి. తాజాగా శంకర్ దర్శకత్వంలో నటించిన ?ఐ? సినిమా కూడా పెద్ద విజయం నమోదు చేయనప్పటికీ నటుడిగా విక్రమ్ స్థాయిని ఆకాశానికి పెంచింది. మళ్ళీ ఇప్పుడు విక్రమ్ అలాంటి ప్రయోగమే చేయనున్నాడు. దర్శకుడు ?ఆనంద్ శంకర్? దర్శకత్వంలో ?ఇరుమురుగన్? పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు.
పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ?ఇంకొక్కడు? పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మధ్యే విడుదలైన టీజర్ సైతం ఆకట్టుకునే విధంగా వైవిధ్యంగా ఉంది. సినీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గతంలోలా కాకుండా ఆధ్యంతం అలరించే థ్రిల్లింగ్, యాక్షన్ సన్నివేశాలతో ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్ర ఆడియో ఆగష్టు 2న చెన్నైలో దక్షిణ భారత స్టార్ హీరోలందరి నడుమ భారీ ఎత్తున జరగనుంది.

,  ,  ,  ,  ,  ,  ,