Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2016 10:56:40
facebook Twitter Googleplus
Photo

2016 ప్రారంభంలో ప్రీతి జింటా పెళ్లి చేసుకున్న సంగతి జనాలకు తెలిసిందే. ఫిబ్రవరి 29న జీనీ గుడెనఫ్ అనే వ్యక్తితో ప్రీతి వివాహం జరిగింది. అమెరికాలో ఓ హైడ్రాలిక్ కంపెనీ ఫైనాన్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ ఇతను. పేద్ద రాయల్ ఫ్యామిలీ వ్యక్తి. ప్రీతి-జీని లది ప్రేమ వివాహం కూడా. అమెరికాలోనే ఓ ప్రైవేటు కార్యక్రమం మాదిరిగా సన్నిహితులు-స్నేహితుల మధ్య ఈ పెళ్లి కార్యక్రమం పూర్తయిపోయింది.

అయితే తన భర్తను మాత్రం అభిమానులకు వెంటనే పరిచయం చేయలేదు ప్రీతి జింటా. ఏఫ్రిల్ లో ఓ సారి ముంబై వచ్చినపుడు.. రిసెప్షన్ పేరుతో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి స్టార్లకు.. సెలబ్రిటీలకు మాత్ర తన భర్త జీనీ గుడెనఫ్ ను ఇంట్రడ్యూస్ చేసింది. అపుడే ఈమెను భర్త గురించి.. పెళ్లి ఫోటోల గురించి చాలామంది అడిగారు. కానీ ప్రీతి మాత్రం వాటిని వేలం వేస్తామని.. ఓ మంచి పని కోసం ఉపయోగిస్తామని చెప్పేసి తప్పించుకుంది. వేలం జరిగిందో లేదో.. ఆ సొమ్ములు దానం చేసిందో లేదో కానీ.. ఇప్పుడు మాత్రం జీనీ గుడెనఫ్-ప్రీతి జింటాల పెళ్లి ఫోటోలు లీక్ అయ్యాయి.

పెళ్లికూతురు గెటప్ లో మహారాణి రేంజ్ లో కనిపిస్తోంది ప్రీతి. అలాగే ఈమె భర్త ఫోటో కూడా అందరికీ తెలిసింది. పెళ్లికి ముందే ఓ ఐపీఎల్ మ్యాచ్ లో వీరిద్దరకూ కలిసి సందడి చేసిన సంగతులను అభిమానులకు గుర్తు చేస్తున్నాయి ఈ ఫోటోలు.

,  ,  ,  ,  ,