Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2017 12:03:41
facebook Twitter Googleplus
Photo

అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కిన కొన్ని చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంటాయి. ఈ మధ్య ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా కూడా అలాగే జనాల్ని ఆకట్టుకుంది. ఈ చిత్ర ట్రైలర్ వారం కిందటే రిలీజ్ చేశారు. కార్తికేయ-సిమ్రత్ అనే కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ రిషి అనే డెబ్యూ డైరెక్టర్ రూపొందించిన సినిమా ఇది. దీని ట్రైలర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

మంచి ఫీల్ ఉన్న సినిమాలా అనిపించింది ఈ ట్రైలర్ చూస్తే. గొల్లపూడి మారుతీరావు లాంటి లెజెండ్ వాయిస్ ఓవర్.. చక్కటి డైలాగులు ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫొటోగ్రఫీ.. మ్యూజిక్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఆకర్షణీయంగా అనిపించిన ఈ ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. విశేషం ఏంటంటే.. ఈ చిన్న సినిమాను దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత రిలీజ్ చేయబోతున్నారు.

ఈ నెల 17న ప్రేమతో మీ కార్తీక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు అప్పుడప్పుడూ కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్ని పిక్ చేసి తన బేనర్ మీద రిలీజ్ చేస్తుంటారు. కుమారి 21 ఎఫ్.. సినిమా చూపిస్త మావ లాంటి సినిమాల్ని అలాగే విడుదల చేశారు రాజు. కొన్ని నెలల కిందట వెళ్లిపోమాకే అనే సినిమాను కూడా ఆయన రిలీజ్ చేశారు. ఈ కోవలోనే‘ప్రేమతో మీ కార్తీక్ కూడా ఆయన సపోర్టుతో రిలీజ్ కానుంది.

,  ,  ,  ,  ,