Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 17:23:02
facebook Twitter Googleplus
Photo

ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై మెప్పించిన పవన్ సాదినేని, గత నెలలో తన రెండో ప్రయత్నంగా సావిత్రి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ సినిమాపై దర్శకుడు చాలానే ఆశలు పెట్టుకున్నా, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇక ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమాను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న పవన్, ఆ వివరాలను పంచుకున్నారు. తన మొదటి సినిమా తరహాలోనే ఓ రొమాంటిక్ కామెడీ కథాంశంతో మూడో సినిమాను ప్లాన్ చేసినట్లు పవన్ స్పష్టం చేశారు.
నాగార్జున హీరోగా నటించిన నిర్ణయం సినిమాలోని బాగా పాపులర్ అయిన ?హలో గురూ ప్రేమ కోసమేరా? అన్న పాట లైన్‌నే తీసుకొని, అదే టైటిల్‌తో పవన్ తన కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం తెలుగులో ట్రెండ్‌గా మారిపోయిన పాటల నుంచి టైటిల్ తీస్కోవడమనేది ఇంకా అదేవిధంగా కొనసాగుతూండడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పవన్ సాదినేని ఈ సందర్భంగా తెలియజేశారు.

,  ,  ,  ,  ,  ,