Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2015 14:00:16
facebook Twitter Googleplus
Photo

ప్రియమణి ఇప్పుడు బాగా స్లో అయింది కానీ.. అన్ని రకాల పాత్రలూ చేయగల ట్యాలెంట్ ఉన్న హీరోయిన్ ఈమె. నేషనల్ అవార్డ్ కూడా సాధించిన ఘనత ఈమె కెరీర్ లో ఉంది. పీక్ స్టేజ్ లో ఉండగానే.. విభిన్నమైన ప్రయోగాలు చేయడంతో గాడి తప్పిన మాట వాస్తవమేనని చెప్పాలి.

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటారు. కొందరు ప్రొఫెషనల్ గా దగ్గరైతే.. మరికొందరు పర్సనల్ గా నచ్చుతుంటారు. ఇలా ప్రియమణికి కూడా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఉన్నా.. మరీ దగ్గరైపోయిన వాళ్లు మాత్రం పెద్దగా లేరట. ఇంకా చెప్పాలంటే.. పొద్దునే ఫోన్ చేసి ఓ గుడ్ మార్నింగ్ నో - ఓ హాయ్ నో చెప్పే స్నేహితులు మాత్రం ఒకరు కూడా లేరట. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ అంటే మాత్రం.. అందరూ అంటోంది ప్రియమణి. అయితే.. నచ్చే హీరోయిన్ల విషయంలో త్రిష పేరు ముందు ఉంటుందంటోంది ప్రియమణి. తనకు ఎవరి యాక్టింగ్ నచ్చినా.. వాళ్ల సోషల్ నెట్వర్కింగ్ పేజ్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పింది ప్రియమణి.

తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేకపోయినా.. ఎవరిదైనా బయోపిక్ ని మూవీగా చేస్తే.. నటించాలని ఉందిట ప్రియమణికి. అయితే ఇప్పుడ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్ళిచేసుకుంటున్నా అనే న్యూస్ లీక్ చేశాక.. ఎందుకో వచ్చే చిన్న చిన్న ఆఫర్లు కూడా తగ్గాయ్ అంటూ కాస్త నిధానంగానైనా ఒప్పేసుకుందీ అమ్మడు.

,  ,  ,