Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2015 14:30:45
facebook Twitter Googleplus
Photo

ప్రియాంక చోప్రా ఏషియన్ టాప్ త్రీ రేంజ్ కి చేరుకుంది. ట్విట్టర్ ఫాలోయింగ్ విషయంలో ఇప్పుడు ప్రియాంక ర్యాంక్ ఇది. సరిగ్గా ఈమె నటించిన బాజీరావు మస్తానీ రిలీజ్ రోజునే ఈ ఫీట్ సాధించడంతో.. ఇప్పుడు ప్రియాంక ఫుల్ హ్యాపీగా ఉంది.

ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ భామకు గల ఫాలోయర్ల సంఖ్య కోటీ 20 లక్షలు. ఈమె కంటే ముందు ఇండోనేషియా సింగర్ కం నటి ఆగ్నేజ్ మో కోటీ 45 లక్షల మంది ఫాలోయర్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో ప్లేస్ లో ఉన్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేని 12.5 కోట్ల మంది అనుసరిస్తున్నారు. "ధాంక్యూ సో మచ్. గుడ్ లక్ చెబుతూ బహుమతి ఇచ్చినట్లుగా ఉంది. మీరంతా నా బలం" అంటూ ఈ ఆనందాన్ని ట్వీట్ రూపంలో చెప్పింది ప్రియాంక. మొదట మోడల్ గాను ఆ తర్వాత యాక్టర్ గాను సత్తా చాటిన ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ కలల రాణిగా మారింది.

అనేక అంతర్జాతీయ వేదికల పైనా తన సింగింగ్ ట్యాలెంట్ ను ఇప్పటికే ప్రదర్శించింది ఈ మాజీ మిస్ వరల్డ్. రీసెంట్ గా హాలీవుడ్ సీరియల్ క్వాంటికో లో యాక్ట్ చేయడంతో.. పీసీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గత ఏడాది కాలంలోనే ఈమె ఫాలోయర్ల సంఖ్య రెట్టింపు అయిందంటే.. ప్రస్తుతం ప్రియాంక క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఈ స్పీడ్ మరికొంత కాలం కంటిన్యూ అయితే మాత్రం.. అసియా ఫస్ట్ కి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.

అమ్మడు నటించిన తాజా చిత్రం బాజీరావ్ మస్తానీ సినిమా నిన్నే రిలీజ్ అయ్యి ప్రశంసలు పొందింది.

,  ,  ,