Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2016 16:46:48
facebook Twitter Googleplus
Photo

తన కేరక్టర్లతోనే కాదు.. ఓపెన్ గా మాట్లాడేయడంలో దర్శకుడు పూరీ జగన్నాధ్ కు కావాల్సినంత గుర్తింపు ఉంది. లోఫర్ డిస్ట్రిబ్యూటర్లతో వివాదం అయినా.. చిరు 150వ సినిమా చేతికొచ్చి తప్పిపోవడంపై అయినా.. పూరీ చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్ అనే సంగతి అర్ధమవుతూనే ఉంది. ఇక నిర్లక్ష్యంగా మాట్లాడే పూరీ హీరోల కేరక్టరైజేషన్.. వాళ్లు మాట్లాడే తీరు.. తెలుగు సినిమాల్లో సెన్సేషన్. మరి పూరీ గురించి పూరీ జగన్నాధ్ మాటల్లో తెలుసుకుంటే ఎలా ఉంటుంది? ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ఇజం తీసిన పూరీ జగన్నాధ్.. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన అనుభవాలను కూడా పంచుకున్నాడు.

'సినిమా పరిశ్రమకు ఏ మాత్రం సంబంధం లేని సాధారణ రైతు కుటుంబంలో పుట్టా. నాన్న తెచ్చి ఇంట్లో పెట్టే పుస్తకాలు చాలా చదవబట్టే.. ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. 6వ తరగతి నుంచే చిన్న చిన్న కథలు రాసేవాడిని. నాన్న కోసం బుక్ షెల్ఫ్ లో ఉంచే వాడిని తప్ప.. స్కూల్ లో ఎవరికీ చూపించలేదు. వారెవరికీ ఆ కథలో డెప్త్ తెలుసుకోగల స్థాయి లేదని నా ఉద్దేశ్యం' అంటూ ఓ స్టోరీని వివరించాడు.

'ఓ 70 ఏళ్ల ముసలి పెయింటర్ ను ఓ యంగ్ లేడీ పెళ్లి చేసుకుంటుంది. సాధారణంగా డబ్బు కోసం ఆమె చేసుకుంది అనుకుంటారు కానీ.. నా కథలో ఆమే బాగా ధనవంతురాలు. ఈ కథలోని ఆ పెయింటింగ్ లోని ఫీల్ ను అందరూ అర్ధం చేసుకోలేరు కదా' అంటున్నాడు పూరీ.

'నాకు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం ఇష్టం. ఇంకా చెప్పాలంటే అసలు మనుషులు నచ్చరు. మనమందరం ఓ పెద్ద అడవిలో ఉన్నామని.. మనుషులు జంతువుల ప్రపంచంలో ఓ భాగమేనని నమ్ముతాను. అవి ఉన్నంత ఆనందంగా మనం ఉండలేం కదా. 90శాతం మంది ఒక విషయాన్ని నమ్మి సపోర్ట్ చేస్తే.. ఓ 10 శాతం మంది మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తారు. నాకు ఆ పది శాతమే నచ్చుతారు. వాళ్లే జీనియస్ లు అని నా ఉద్దేశ్యం. అలాగనే వాళ్లే అన్నీ చేసేస్తారని కాదు. వాళ్లు కొత్త విషయాన్ని కనిపెట్టగలరు' అంటూ తన ఆలోచనను ఆవిష్కరించాడు పూరీ జగన్.

'థాయ్ ల్యాండ్ నేను వెళ్లినపుడల్లా అక్కడి మసాజ్ లు.. సుఖాల కోసం అనుకుంటారు. కానీ అక్కడి వాతావరణం.. మనుషుల మొహాల్లో నవ్వు.. పనిని ప్రేమించే తత్వం నాకు నచ్చుతాయి. సాధారణంగా నాకు ఆరు నెలలు పట్టే పని.. బ్యాంకాక్ లో రెండు వారాల్లో పూర్తయిపోతుంది. ఇన్నేళ్లలో నాకు ఒక్క థాయ్ ల్యాండ్ గాళ్ తో కూడా సెక్స్ అనుభవం లేదు. అసలు నేను సెలవలు తీసుకున్నదే లేదు. 2006లో నేను బాగా ఒత్తిడిలో ఉన్నపుడు బ్యాంకాక్ వెళ్లి 3 రోజుల పాటు రూమ్ లోంచి బయటకు రాకుండా రెస్ట్ తీసుకున్నా. ఇది కాకుండా రీసెంట్ గా రోమ్ లో మూడు రోజులు.. బ్యాంకాక్ లో ఐదు రోజులు. గత 15 ఏళ్లలో నా విశ్రాంతి రోజులు ఇవే' అంటున్న పూరీ.. బ్యాంకాక్ వెళ్లినపుడల్లా ఓ లేడీతో ఫుట్ మసాజ్ చేయించుకుంటానని.. ఆమె 55 ఏళ్ల వయసున్న పోన్సీ అనే మహిళ అని చెప్పాడు.

'సినిమాలు కాకుండా వేరే ఇండస్ట్రీలో సెటిల్ అవాలంటే బార్ టెండర్ కానీ వెయిటర్ కానీ అవుతాను. ఫ్యూచర్ లో తప్పనిసరిగా ఆ పని చేస్తా. లేకపోతే నేనే ఓ హోటల్ స్టార్ట్ చేసి అయినా వెయిటర్ అవుతా' అంటూ నవ్వేసిన పూరీ.. అందుకు కారణం వివరించాడు. 'నేను ఇండస్ట్రీలో ఇంకా సెటిల్ కాని రోజుల్లో చౌదరి మెస్ లో ఓ వృద్ధ జంటతో కలిసి పని చేసేవాడిని. అక్కడి అనుభవాలు నాకు జీవితంలో చాలా నేర్పించాయి' అని చెప్పాడు పూరీ

,  ,  ,  ,