Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2015 11:55:12
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీకాంత్ కి దేశ - విదేశాల్లో అసాధారణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. జపాన్ - మలేషియా - సింగపూర్ వంటి చోట రజనీని విపరీతంగా అభిమానించే వాళ్లున్నారు. అందుకే అతడు నటించిన ప్రతి సినిమా విదేశాల్లోనూ డాలర్లు కురిపిస్తుంటాయి. అంతేకాదు సూపర్ స్టార్ కి దేశ ప్రధానులు - గవర్నర్ లు సైతం అభిమానులు.

మలేషియా గవర్నర్ మలక్కా మహమ్మద్ ఖలీల్ యాకూబ్ కూడా రజనీకి వీరాభిమాని. అతడు త్వరలోనే తమ ప్రభుత్వం తరపున ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును రజనీకి ఇవ్వాలని నిర్ణయించారు. బ్రిటీష్ నైట్ హుడ్ అన్న బిరుదుకు సమానమైన ఈ బిరుదును దాతుక్ అని పిలుస్తారు. త్వరలోనే మలేషియాలో ఓ ఘనమైన వేదికను ఏర్పాటు చేసి రజనీని సన్మానించి ఈ బిరుదుతో సత్కరించనున్నారు. ఇప్పటికే ఆ మేరకు రజనీకి పిలుపు అందింది.

రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కబాలి షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా గవర్నర్ పిలుపు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోనే ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బిరుదు. హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ - బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తర్వాత దాతుక్ బిరుదును అందుకుంటున్న ఏకైక స్టార్ రజనీకాంత్ మాత్రమే. ఇకనుంచి దాతుక్ రజనీకాంత్ అని పిలవాలన్నమాట!

,  ,  ,