Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jul-2017 10:45:27
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ మూవీ అంటేనే.. విపరీతమైన క్రేజ్ ఏర్పడిపోతోంది. వరుస సక్సెస్ లు.. బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న జూనియర్.. ఇప్పుడు జై లవ కుశ అంటూ సినిమా చేస్తుండగా.. రీసెంట్ గా జై పాత్రను పరిచయం చేస్తూ టీజర్ కూడా ఇచ్చారు.

రావణుడిని ఆరాధించే నెగిటివ్ పాత్రలో జై గా ఎన్టీఆర్ భయపెట్టిన తీరు అసామాన్యం. ఈ టీజర్ ప్రతీ ఒక్కళ్లకీ నచ్చింది కానీ.. ఒక్కరికి మాత్రం మింగుడుపడ్డం లేదంటూ.. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కథనాన్ని వండి వడ్డించింది. ఆయనెవరో కాదు.. ఎన్టీఆర్ తో టెంపర్ తీసిన పూరీ జగన్నాథ్. జై లవ కుశకు.. పూరీకి లింక్ ఏంటి అనుకోవచ్చు కానీ.. ఈ జై పాత్రను మలిచిన తీరు పూరీకి షాక్ కొట్టించిందట. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ తో మళ్లీ సినిమా చేసేందుకు ప్రిపేర్ అయిన పూరీ జగన్నాథ్.. ఓ స్టోరీని.. కేరక్టరైజేషన్ ను ఎన్టీఆర్ కు నెరేట్ చేశాడట. తాను ఎలాంటి కేరక్టరైజేషన్ తో అయితే.. ఎన్టీఆర్ రోల్ ను వర్ణించాడో.. ఇప్పుడు అదే పాత్ర అచ్చంగా జై లో కనిపించేసరికి.. పూరీ హర్ట్ అయ్యాడని.. ఎన్టీఆర్ ను స్క్రిప్ట్ దొంగ అని భావిస్తున్నాడని.. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఆర్టికల్ వచ్చింది.

తమ హీరోపై ఆ పత్రికలో ఇలాంటి కథనం రావడంపై ఎన్టీఆర్ అభిమానులు తెగ ఫీలయిపోతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ జోరుకు కళ్లెం వేసేందుకు కుళ్లు కొద్దీ ఇలాంటివి ప్రచురిస్తున్నాయని మండిపడుతున్నారు.

,  ,  ,  ,  ,