Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2016 11:02:33
facebook Twitter Googleplus
Photo

స్టోరీ నెరేషన్ విషయంలో పూరీ జగన్నాథ్ స్టయిలే వేరు. హీరో పాత్రను పోలీస్ చేసి ఎన్ని రకాలుగా అయినా తీసేయగలడు. అంతేనా.. అరటి తొక్కపై కాలేస్తే ఏంటి.. వెయ్యకపోతే ఏంటి అని అదే స్టోరీ మార్చిమార్చి చెప్పగల ట్యాలెంట్ పూరీది. అలాగే తను రాసుకున్న స్టోరీపై పూర్తి కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించే పూరీ.. అది నచ్చలేదని మెగాస్టార్ చిరంజీవి అన్నా సరే యాక్సెప్ట్ చేయని సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఇజం ట్రైలర్ చూశాక.. ఇంత భారీ యాక్షన్ మూవీనా అని చాలామంది అనుకున్నారు. దీని వెనక ఓ పెద్ద స్టోరీ ఉంది. అప్పట్లో హార్ట్ ఎటాక్ మూవీని వరుణ్ తేజ్ తో తీద్దామన్నది పూరీ ఐడియా. మెగా హీరో వద్దంటే.. నితిన్ తో తీసేసి హిట్ అనిపించేశాడు. తర్వాత వెంటనే నితిన్ తో చేద్దామని అనుకుంటే.. ఆ కథను నితిన్ వద్దాన్నాడు. అదే స్టోరీని లోఫర్ అంటూ.. వరుణ్ తేజ్ తో చేసేశాడని టాక్. లోఫర్ తీసేటపుడే ఎన్టీఆర్ కు ఓ కథ చెప్పాడు. అది నచ్చలేదన్న జూనియర్.. వక్కంతం వంశీ స్టోరీని చేతిలో పెట్టి.. టెంపర్ తీయించాడు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో తీస్తున్న ఇజం.. అప్పట్లో ఎన్టీఆర్ కి చెప్పిన స్టోరీనే అనే టాక్ ఉంది. ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన భారీ యాక్షన్ డ్రామాను యాజిటీజ్ గా మరో నందమూరి హీరోతో తీసేశాడని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోకి సరిపడే రేంజ్ స్టోరీ.. స్క్రీన్ ప్లే ఉంటాయని అంటున్నారు. అన్నీ బాగుండి ఇజం సక్సెస్ అయితే.. పూరీ అండ్ కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో భారీ సక్సెస్ పడ్డట్లే అనుకుంటున్నారు

,  ,  ,  ,