Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2016 11:42:30
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు. వెకేషన్ ను పూర్తి చేసుకుని వచ్చాక తన తదుపరి సినిమా గురించి ప్రకటన చేస్తాడు. అయితే ఒక క్లాసిక్ తీస్తాడని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను నమ్మితే.. ఆయన జనాలను కన్య్ఫూజ్ చేసి.. ప్రేక్షకుల్లో మహేష్ బాబుపై ఉన్న అంచనాలను తల్లక్రిందులు చేసేశాడు. అదే క్రమంలో మరో విషయం కూడా ప్రూవ్ చేశాడు.

ఇప్పటివరకు ఎవరైనా ఒక దర్శకుడికి మహేష్ బాబు రెండో ఛాన్సిస్తే.. ఖచ్చితంగా అది సదరు డైరక్టర్ సరిగ్గా వినియోగించుకోలేదు అనే చెప్పాలి. ఒక్కడు సినిమాను తీసిన గుణ శేఖర్.. ఆ తరువాత అర్జున్ అండ్ సైనికుడు అనే డిజాష్టర్లు తీశాడు. అతడు సినిమా (రిలీజైనప్పుడు యావరేజ్ టాక్ వచ్చింది) తీసిన త్రివిక్రమ్.. ఖలేజా వంటి ఫ్లాప్ చేతిలో పెట్టాడు. దూకుడుతో మహేష్ రేంజు మార్చిన వైట్ల కూడా ఆగడుతో పెద్ద దెబ్బే వేశాడు. ఇక సీతమ్మ వాకిట్లో సినిమాను తీసిన శ్రీకాంత్ అడ్డాల.. తాను కూడా ఈ లిస్టులోనే చేరతానంటూ ప్రూవ్ చేసుకున్నాడు. బ్రహ్మోత్సవం తో గాట్టి స్ర్టోక్ నే ఇచ్చాడు. ఇలా అందరూ రెండోసారి ఛాన్సిస్తే ఖచ్చితంగా హ్యాండే ఇచ్చారు. హిట్టును పక్కనెట్టి ఫ్లాపుతో కొట్టారు.

ఒక్క పూరి జగన్ మాత్రమే.. పోకిరి తరువాత బిజినెస్ మ్యాన్ తో డిజాష్టర్ కాకుండా.. ఎబోవ్ యావరేజ్ సినిమాను ఇచ్చాడు. కంటెంట్ కాస్త ఇంటెన్సివ్ గా ఉంటుందనే కాని.. సినిమా మాత్రం ఇంప్రెస్ చేసింది. మరి పూరి సరసన చేరే మరో డైరక్టర్ ఎవరో??

,  ,  ,  ,  ,  ,  ,