Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2015 16:52:46
facebook Twitter Googleplus
Photo

బాహుబలి 2 ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్. బాహుబలి సాధించిన అసాధారణ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని జక్కన్న పార్ట్ 2ని అసాధారణ బడ్జెట్ తో గ్రేట్ కాంబినేషన్ సెట్ చేసి ఆన్సెట్స్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారని ప్రచారమవుతోంది. ఈ సినిమాలో కాస్టింగ్ గురించి ఇప్పటికే జనాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. అప్పట్లో కోలీవుడ్ హీరో సూర్య బాహుబలి లో నటించేందుకు ఉత్సాహం చూపించాడు. రాజమౌళి ఓ చిన్న క్యారెక్టర్ లో అవకాశం ఇచ్చినా నటించాలనుందని అన్నాడు.

దాంతో రాజమౌళి రెండో భాగంలో సూర్య కోసం ఓ క్యారెక్టర్ ని క్రియేట్ చేశాడన్న ప్రచారమూ ఊపందుకుంది. త్వరలోనే సూర్యని కలిసి కథ క్యారెక్టర్ రెండూ వివరిస్తారన్న ప్రచారం టాలీవుడ్ లో ఊపందుకుంది. కొందరైతే సూర్య ఖరారైనట్టేనని ప్రచారం సాగించేశారు. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని సూర్య కొట్టి పారేశాడు. ఇప్పటివరకూ రాజమౌళి నన్ను సంప్రదించిందే లేదు అంటూ నవ్వేశాడు. ఇప్పటికైతే ఏమీ లేదు. ఒకవేళ ఉంటే చెబుతానని అన్నాడు.

ప్రస్తుతం సూర్య హీరోగా సింగం ఫ్రాంచైజీ నుంచి మూడో సినిమా తెరకెక్కనుంది. హరి ఈ చిత్రానికి కథ రెడీ చేసి రంగం సిద్ధం చేశాడు. అనుష్క శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. 24 సినిమా పూర్తి చేయగానే సింగం సెట్స్ కెళుతుంది. ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్న సూర్య బాహుబలిలో నటిస్తాడా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అంతా జక్కన్న చేతిలోనే ఉంది. విజయేంద్రుడి కథలోనే మ్యాజిక్ చేయాలి. అప్పుడు ఛాన్స్ తప్పక ఉంటుంది.

,  ,  ,