Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2017 11:25:36
facebook Twitter Googleplus
Photo

ఈ తరం స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాధ్ కు బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. ఇప్పడు ఫ్లాపులతో వెనకబడ్డాడు కానీ.. పూరీకి ఇండస్ట్రీలో కూడా అనేకమంది ఫ్యాన్స్ ఉంటారు. నేను ఓ పెద్ద సీన్ లో చెప్పగలిగే భావాన్ని.. పూరీ కేవలం సింగిల్ డైలాగ్ లో చెప్పగలడు అని రాజమౌళి లాంటి డైరెక్టర్ అన్నాడంటే పూరీ స్థాయి అర్ధమవుతుంది.

అలాంటి ఈ దర్శకుడికి ఇప్పుడు ఓ వీరాభిమాని విగ్రహం పెట్టేశాడు. తెలంగాణలోని కరీనంగర్ జిల్లాలో ఉన్న కొండాపూర్ గ్రామంలో ఈ విగ్రహం ఏర్పాటైంది. ప్రభాకర్ అనే వీరాభిమాని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చిన్నప్పటి నుంచి పూరి జగన్నాధ్ కు వీరాభిమాని అయిన ప్రభాకర్.. తన ఊళ్లోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పూరీ సినిమాలపై ఇతనికి విపరీతమైన ప్రేమ ఉంటుందని.. పూరీ తీసిన ప్రతీ సినిమాను అనేక మార్లు చూస్తూ ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు.

అంతే కాదు.. ఈ విగ్రహావిష్కకరణను పూరీ జగన్నాధ్ కుమారుడు ఆకాష్ చేతుల మీదుగానే చేయించడం విశేషం. తండ్రి విగ్రహాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయిన ఆకాష్.. తన తండ్రిపై ప్రభాకర్ చూపిస్తున్న ప్రేమను చూసి షాక్ తినేశాడు.

,  ,  ,  ,  ,