Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2016 12:32:56
facebook Twitter Googleplus
Photo

బాహుబలి మూవీలో అనుష్క ఏ రేంజ్ లో యుద్ధాలు చేసేసిందో ఇంకా పూర్తి స్థాయిలో చూసే అదృష్టం తెలుగు ప్రేక్షకులకు దక్కలేదు. ఇప్పటివరకూ కేవలం ట్రైలర్.. దేవసేన ఇంట్రడక్షన్ లో మాత్రమే చూడగలిగారు. అయితే.. మాహిష్మతికి రాజుగా ఎంపికైన బాహుబలికి భార్య కాబట్టి.. తనే మాహిష్మతి రాణి.

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కొంచెం బొద్దుగా కనిపిస్తున్నంత మాత్రాన ఈమె ట్యాలెంట్ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అపోహలు లేవు కాబట్టి.. స్వీటీ మరికొన్నేళ్లు సత్తా చూపించడం ఖాయం. మరోవైపు రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాదించి.. భారత గౌరవాన్ని ఇనుమడింపచేసిన పీవీ సింధు మరోపక్క కనిపిస్తోంది. ఇలా మాహిష్మతి రాణితో.. రియో రాణి కలిసి ఫోటో దిగిన అపూర్వమైన సందర్భం ఒకటి గతంలో చోటు చేసుకుంది. అయితే.. ఈ ఫోటో సింధు సిల్వర్ మెడల్ సాధించక మునుపు తీసినది. అయినా సరే ఇద్దరు రాణులు కలిసిన అపూర్వమైన సందర్భం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడంలో తప్పులేదు.

ఇక మళ్లీ బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టేందుకు సింధు సిద్ధమవుతుంటే.. అనుష్క వరుసగా సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోంది. సూర్యతో సింగం3.. బాహుబలి 2... భాగమతిలతోపాటు అజిత్ కొత్త సినిమా కూడా సెట్స్ ఉంది.

,  ,  ,  ,