Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2016 15:34:50
facebook Twitter Googleplus
Photo

పీవీపీ సినిమా.. అనతి కాలంలోనే టాలీవుడ్ లో పెద్ద బ్యానర్ గా అవతరించినా.. ఆ స్థాయిలో సక్సెస్ లు కొట్టలేకపోయింది. లో బడ్జెట్ మూవీ క్షణం సక్సెస్ తర్వాత ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన మహేష్ బాబు బ్రహ్మోత్సవం అయితే.. పీవీపీ పై పెద్ద దెబ్బే వేసింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ కి.. ఇక సినిమా రంగం నుంచి పీవీపీ తప్పుకోనున్నారనే వార్తలు కూడా వచ్చేశాయి. పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేకపోయిన బ్రహ్మోత్సవం.. పీవీపీ సినిమా ఇమేజ్ ను కూడా దెబ్బ తీసింది.

అయితే.. ఈ వార్తలన్నిటినీ అధిగమిస్తూ.. మళ్లీ సక్సెస్ బాట పట్టిందీ బ్యానర్. కార్తీతో చేసిన కాష్మోరాను తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేయగా.. రెండు చోట్లా డివైడ్ టాక్.. మిక్సెడ్ రివ్యూలు వచ్చాయి. వీటిని ఖాతరు చేయకుండా.. కార్తీ నటించిన ఈ కామెడీ కం దెయ్యాల కాన్సెప్ట్ సినిమాకి జనాలు బాగానే ఓటేశారు. ఇప్పటికే కాష్మోరా సేఫ్ ప్రాజెక్టు అయిపోయిందని చెబుతున్నారు ట్రేడ్ జనాలు. కార్తీ రేంజ్ కంటే భారీగా ఖర్చు పెట్టేయడంతో కాష్మోరా కూడా పీవీపీకి షాక్ ఇస్తుందనే అనుకున్నారు కానీ.. ఇది లాభాలను తెచ్చిపెడుతుండడం విశేషం.

క్షణం తర్వాత మళ్లీ పీవీపీ బ్యానర్ కు లాభాలు తెచ్చిపెడుతున్నది కార్తీ కాష్మోరానే కావడం విశేషం. ప్రస్తుతం అయితే.. ఈ బ్యానర్ మళ్లీ స్పీడ్ పెంచేసి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేసింది. దగ్గుబాటి రాణా నటిస్తున్న ఘాజీ.. రాజుగారి గది-2.. నాగార్జునతో ఓ చిత్రంతో పాటు.. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు పీవీపీ

,  ,  ,  ,  ,  ,