Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2017 11:16:48
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా కెరీర్ కు ఇప్పుడు మంచి టైం నడుస్తోందని చెప్పాల్సిందే. తొలిసారిగా టాప్ లీగ్ లో ఉన్న స్టార్ హీరోతో జత కట్టింది. ఎన్టీఆర్ తో కలిసి జై లవ కుశలో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు మలయాళంలో కూడా ఇప్పటికే ఆఫర్ పట్టేసింది.

మల్లూవుడ్ లో మోహన్ లాల్ మూవీతో రాశి అరంగేట్రం చేస్తుండడం విశేషం. అంతే కాదు.. తన చిన్ననాటి కలను ఈ సినిమాతో నెరవేర్చుకుంది రాశి ఖన్నా. 'నా బాల్యం నుంచి ఉన్న ఓ కలను ఇప్పుడు తీర్చుకోగలిగే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను నటిస్తున్న మలయాళ చిత్రం విలన్ లో టైటిల్ ట్రాక్ ను పాడాను. మీ అందరూ ఆ పాటను ఎంత త్వరగా వింటారా అని ఎదురుచూస్తున్నా' అంటూ రికార్డింగ్ స్టూడియో నుంచి తీసిన ఫోటోతో పాటు షేర్ చేసింది రాశి ఖన్నా.

ఈ చిత్రంలో రాశి ఖన్నా ఓ పోలీస్ పాత్రను పోషిస్తుండగా.. మోహన్ లాల్ ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. మంజు వారియర్ మరో లీడ్ రోల్ లో నటిస్తుండగా.. ఈ చిత్రంలో విశాల్.. హన్సిక.. శ్రీకాంత్ లు కూడా నటిస్తుండడం విశేషం.

,  ,  ,  ,  ,