Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2015 12:32:55
facebook Twitter Googleplus
Photo

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదగాలంటే అందాల ప్రదర్శన ఒక్కటే మార్గం. ఇది ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. ఎంత చూపిస్తే.. అంత క్రేజ్ అన్నట్లుగా రెచ్చిపోతారు భామలు. ఈ ఫార్ములాకి చెక్ పెట్టేసి చకచకా దూసుకుపోతోంది రాధికా ఆప్టే. ఫార్మాలాలను బ్రేక్ చేసి ట్యాలెంట్ తోనే అవకాశాలు పట్టేస్తోంది.

లేటెస్ట్ గా ఈ భామ రజనీకాంత్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. కనీసం స్క్రీన్ టెస్ట్ లాంటివి కూడా చేయకుండా సెలెక్ట్ కావడం ఆనందాన్ని ఇస్తోందని చెప్పింది రాధికా ఆఫ్టే. హీరోయిన్ గా తాను చేయాలని కోరుకుంటున్నట్లుగా.. కాల్ చేసి చెప్పారని ఇంత పెద్ద ఛాన్స్ రావడంతో సంతోషం పట్టలేకపోయానంది రాధిక.

అహల్య వంటి షార్ట్ ఫిలింస్ లో నటిస్తూ.. తనలోని యాక్టింప్ ప్రతిభను చాటుతున్న రాధికా ఆప్టేకు... ఇప్పటికే టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. లెజెండ్ లో నటించిన ఈ అమ్మడు.. డిక్టేటర్ లోనూ బాలయ్యతోపాటు స్క్రీన్ పంచుకోనుంది. ఇప్పడున్న హీరోయిన్ల లో యాక్టింగ్ తో సత్తా చాటుతున్నవారిలో... ఫస్ట్ ప్లేస్ రాధికా ఆప్టేకే ఇవ్వాలి.

,  ,