Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2015 11:05:11
facebook Twitter Googleplus
Photo

మరో దర్శకుడు కెమెరా ముందుకు వస్తున్నాడు. ఆమధ్య 'రిషి' వంటి ఉత్తమ చిత్రాన్ని రూపొందించి, తాజాగా పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ తో 'ఆంధ్రాపోరి' చిత్రాన్ని రూపొందించిన రాజ్ మాదిరాజు నటుడిగా మారుతున్నాడు. 'అలా మొదలైంది' ఫేం నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో ఈ దర్శకుడు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో హీరో నాగశౌర్యకు ఈయన తండ్రిగా ఓ ముఖ్య పాత్రను పోషించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.

,  ,  ,  ,