Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Sep-2015 13:27:12
facebook Twitter Googleplus
Photo

సినిమా సినిమాకు ఇంతింతై అన్నట్లు ఎదిగిపోతూ ఎవ్వరికీ అందనంత ఎత్తులో శిఖరానికి చేరిపోయాడు రాజమౌళి. ?బాహుబలి ది బిగినింగ్? లాంటి విజువల్ ఫీస్ట్ తో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ?బాహుబలి?ని ముగించే పనిలో ఉన్నాడు జక్కన్న. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది. మిర ఆ తర్వాత జక్కన్న ఏం చేస్తాడు? ఎలాంటి సినిమా తీస్తాడు? దాని కథేంటి? హీరో ఎవరు? ఎన్ని భాషల్లో తీస్తాడు? అని దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తితో ఉన్నారు. ఆ ఆసక్తికి తగ్గట్లే జకన్న మదిలో ఓ బృహత్తర ప్రాజెక్టుకు రింగులు తిరుగుతున్నట్లు సమాచారం. బాహుబలి రెండు భాగాలతో కలిపి వెయ్యి కోట్ల మార్కెట్ సృష్టిస్తున్న రాజమౌళి.. తన తర్వాతి సినిమాను వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడన్న సమాచారం విస్మయపరుస్తోంది.

ఇది నమ్మశక్యంగా లేకున్నా నమ్మి తీరాల్సిందే. బాహుబలి రెండు భాగాలకు కలిపి రూ.250 కోట్లు పెట్టిస్తేనే ఔరా అనుకున్నాం. అది చాలా పెద్ద రిస్క్ అనుకున్నాం. కానీ తొలి భాగమే దానికి మూడు రెట్ల గ్రాస్ కలెక్ట్ చేసేలా ఉంది. సరైన ప్లానింగ్ తో తీస్తే మార్కెట్ హద్దులన్నీ చెరిగిపోయి అనూహ్యమైన కలెక్షన్ లు సాధించవచ్చని ?బాహుబలి ది బిగినింగ్?తో రుజువు చేసిన జక్కన్న.. తన తర్వాతి సినిమా విషయంలో ఇంకా పెద్ద సాహసం చేయబోతున్నాడు. ?గరుడ? అనే పేరుతో తెలుగు - తమిళం - హిందీ - ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడట జక్కన్న. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథ వండే పనిలో పడ్డాడట. దీన్ని కూడా ప్రపంచ స్థాయి గ్రాఫిక్స్ - విజువల్ ఎఫెక్టులతో విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలన్నది రాజమౌళి ప్లాన్. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.

,  ,  ,  ,