Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 11:20:07
facebook Twitter Googleplus
Photo

బాహుబలి - భజరంగీ భాయ్ జాన్ సినిమాలతో దేశమంతా ఒక్కసారిగా ఖ్యాతిగడించిన కధకుడు విజయేంద్ర ప్రసాద్. దర్శకుడు రాజమౌళి తండ్రి అన్న బిరుదు దగ్గరనుండి దేశమంతా మెచ్చుకునే కథకుడిగా ఎదిగిన తీరు ప్రశంసనీయం.

విజయేంద్ర ప్రసాద్ కి మాస్ పల్స్ పక్కాగా తెలుసు. ఎక్కడ ఏ సీన్ పడితే కధ పండుతుందో చెప్పడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్యగా మారింది. అన్ని హంగులనీ సమతూకంగా అందించగలరు గాబట్టి ఇప్పుడు ఆయన హాట్ ఫెవరెట్. బాలీవుడ్ - టాలీవుడ్ లలో విజయకేతనం ఎగురవేసిన ఆయన ఇప్పుడు తమిళనాట కూడా తన సత్తా చూపించనున్నారు.

ఇప్పటికే శంకర్ తెరకెక్కేకించిన ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ స్క్రిప్ట్ రాయమని విజయేంద్రప్రసాద్ ని కోరిన సంగతి తెలిసినదే. అది ట్రాక్ లోకి రాకముందే మరో అవకాశం దక్కింది. నేడు ప్రతిష్టాత్మకంగా మొదలుకానున్న విజయ్ 61వ సినిమాకు అత్లీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లేని అందించవలిసిందిగా విజయేంద్రప్రసాద్ ని కోరినట్టు తెలుస్తుంది ఈ సినిమాలో కాజల్ - సమంతా - జ్యోతిక నటించనున్నారు. రెహమాన్ సంగీత దర్శకుడు.

,  ,  ,  ,  ,