Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2017 15:47:22
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ది కంక్లూజన్ ను ఈ నెల 28న విడుదల చేసేయనున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ ప్రాజెక్టు కోసం సుదీర్ఘ కాలం కష్టపడ్డాడు. స్క్రిప్ట్ వర్క్ తో కలిపితే.. బాహుబలి రెండు భాగాల కోసం ఐదు సంవత్సరాల కాలం పట్టింది. మరి బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించే ప్రాజెక్ట్ ఏంటి?

ఈసారి జక్కన్న నుంచి వచ్చే సినిమా బాహుబలిని మించాలని అభిమానులు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు బాహుబలి2 మూవీతో 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్రాన్ని దర్శకుడిగా రాజమౌళి అవతరిస్తాడని ఇండస్ట్రీ నమ్ముతోంది. మరి ఈ తర్వాత తీసే సినిమా తీసే ఇంతకు మించి ఉంటుందని.. అది మహాభారతంపై తీసే చిత్రమేననే టాక్ బాగానే హల్ చల్ చేసింది. అంతే కాదు.. ఈ ప్రాజెక్టులో నటిస్తారంటూ.. అమీర్ ఖాన్.. రజినీకాంత్.. మోహన్ లాల్.. జూనియర్ ఎన్టీఆర్.. మహేష్ బాబుల పేర్లు కూడా వినిపించేశాయి. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.

నేను మహాభారతం సినిమా చేస్తానన్న మాట వాస్తవమే. కానీ ఆ చిత్రాన్ని తీయడానికి నేను కోరుకునే.. నా ఆలోచనలకు తగిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పుడు మహాభారతం తీస్తానని చెప్పాను. కానీ మీడియా మాత్రం నేను చెప్పిన వాటిలో రెండో భాగం వదిలేసి.. మొదటి భాగాన్ని మాత్రమే పబ్లిష్ చేయడంతోనే.. నా తర్వాతి సినిమా అదే అనుకుంటున్నారు అంటూ అసలు విషయం చెప్పేశాడు ఎస్ఎస్ రాజమౌళి.

,  ,  ,  ,  ,