Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2017 13:22:23
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది బిగినింగ్ లో భారతీయ ప్రేక్షకులు చూసిన యాక్షన్ ఎపిసోడ్స్ నెవర్ బిఫోర్ ఆన్ ఇండియన్ స్క్రీన్ అనడంలో ఎవరికీ సందేహాల్లేవు. మంచు కొండల్లోని ఫైట్ కావచ్చు.. దేవసేనను శివుడు విడిపించుకుని వెళ్లేటపుడు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కావచ్చు.. చివర్లో వచ్చే యుద్ధ సన్నివేశాలు కావచ్చు. వేటికవే ప్రత్యేకమైనవి. ప్రేక్షకులకు అవి అద్భుతమైన అనుభూతిని పంచాయి. ఐతే బాహుబలి: ది కంక్లూజన్ లోని యాక్షన్ ఎపిసోడ్లతో పోలిస్తే తొలి భాగంగా చూపించినవి జుజుబి అంటున్నాడు రాజమౌళి. రెండో భాగంలో వీటిని మించిన యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయని రాజమౌళి చెప్పాడు.

బాహుబలి తొలి భాగంలో యాక్షన్ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయి. అవి ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఐతే తొలి భాగంతో పోలిస్తే రెండో దాంట్లో అన్నీ ఇంకా గొప్పగానే ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అంతే. అద్భుతంగా వచ్చాయి. మరింత భారీ స్థాయిలో చేశాం. తొలి భాగంలో బాహుబలి.. భల్లాల దేవుడు కలిసి యుద్ధం చేశారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కొట్టుకోబోతున్నారు. కాబట్టి దాన్ని ఇంకా భారీ స్థాయిలో ప్లాన్ చేశాం. దీన్ని ఫాదర్ ఆఫ్ ఆల్ ఫైట్స్ అని చెబుతాను. ఇది ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త అనుభూతిని పంచుతుంది

,  ,  ,  ,