దర్శక ధీరుడు రాజమౌళి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా టాప్ డైరెక్టర్ అయిపోయాడు. బాహుబలి మూవీతో ఒక్కసారిగా నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చేసుకున్నాడు. ఇప్పటివరకూ అపజయం ఎరుగని దర్శకుడిగా రికార్డు సృష్టించిన రాజమౌళి తీయబోయే కొత్త సినిమా అంటే ఆసక్తి పెరగడం ఖాయం.
ఇప్పుడు జక్కన్న రెండు కొత్త సినిమాలకు సైన్ చేశాడనే న్యూస్.. నిజంగా సెన్సేషనల్ అనాల్సిందే. ప్రస్తుతం బాహుబలి2 మూవీ పోస్ట్ ప్రొడక్షన్.. పబ్లిసిటీ యాక్టివిటీస్ తో ఫుల్ బిజీగా ఉన్న రాజమౌళి.. వచ్చే నెల 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో.. తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి మరీ నిర్మించిన ఆర్కా మీడియా సంస్థకే.. మరో రెండు సినిమాలు చేసేందుకు సైన్ చేశాడట రాజమౌళి. ఇప్పటికే బాహుబలి సిరీస్ ను నిర్మించిన ఆర్కా మీడియా నిర్మాతలు.. రాజమౌళితో మరో రెండు సినిమాలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారన్న మాట.
అయితే.. ఈ రెండు సినిమాలు బాహుబలి వెంటనే తీయాలనే కండిషన్స్ మాత్రం ఏమీ లేవట.