Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2017 11:26:14
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచ నలుదిక్కులు వినిపించేల ధ్వనించింది. కొన్నేళ్ళు పడ్డ కష్టానికి పూర్తి ఫలితాలు పొందింది బాహుబలి టీమ్. తన విజువల్స్ తో అందరినీ మరో ప్రపంచానికి తీసుకువెళ్ళి తన కథతో కథనారంగంలో చెలరేగిపోయి మనల్ని అలరించాడు. మరి ఇప్పుడు అతని తదుపరి చిత్రం ఏమై ఉంటుంది అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు వస్తున్న అన్ని పుకారులుకు తెరదించాడు రాజమౌళి.

రాజమౌళి బాహుబలి 2 వరల్డ్ వైడ్ కలెక్షన్లో 1680 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్లో దంగల్ సినిమా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో రాజమౌళి బాహుబలి ఉంది. తను తరవాత ఒక చిన్న బడ్జెట్ సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. అది ఎంతవరుకు వాస్తవం అనే ప్రశ్నకు నేను చిన్న సినిమా తీయాలి అనేమీ అనుకోవడంలేదు. విజువల్ ఎఫ్ఫెక్ట్స్ తో సినిమా నిర్మించాలి అంటే చాలా కష్టపడవలిసి ఉంటుంది. నా తరవాత సినిమాలో విజువల్ ఎఫ్ఫెక్ట్స్ లేనంత మాత్రాన అది చిన్న సినిమా అయిపోదు. విజువల్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా కూడా పెద్ద సినిమా తీయవచ్చు అని సమాధానం ఇచ్చాడు. అలా చెబుతూ మా నాన్నగారు ఒక మంచి ఎమోషన్ ఉన్న కథ రాస్తున్నారు అది పూర్తికాగానే తరవాత ఎవరిని ఎంపిక చేసుకోవాలో ఎలా ముందుకు నడవాలో తెలుస్తుంది అని చెప్పాడు. కథను నమ్మే టీమ్ మాది కాబట్టి కథ సిద్దంకాగానే చెబుతాను అని తెలియపరిచాడు.

రాజమౌళి ప్రపంచ జైత్రయాత్ర పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్నాడు. విజయేంద్ర ప్రసాద్ గారు కథలు రాయడంలో పూర్తిగా నిమఘ్నం అయి ఉన్నారు

,  ,  ,  ,  ,