Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 11:15:57
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు సీనియర్ హీరో రాజశేఖర్. కానీ తర్వాతి కాలంలో క్రమంగా ప్రభ కోల్పోయి.. ఫేడవుట్ అయిపోయాడు. తెలుగులో రాజశేఖర్ అనే హీరో ఉన్నాడన్న విషయమే జనాలు మరిచిపోయే పరిస్థితి వచ్చేసింది. చివరగా రెండేళ్ల కిందట ఆయన నటించిన ?గడ్డం గ్యాంగ్? సంగతేమైందో తెలిసిందే. ఆ తర్వాత అసలే కనిపించకుండా పోయిన రాజశేఖర్.. ఇన్నాళ్లకు మళ్లీ ఓ సినిమా చేస్తున్నాడు. ఎల్బీడబ్ల్యూ.. చందమామ కథలు.. గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ ఓ పోలీస్ కథలో నటిస్తున్నాడు.

ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనుండటం విశేషం. రాజశేఖర్ కు ఇలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్లు అవీ కొత్తే అని చెప్పాలి. ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేసే సమయానికి ఇలాంటివి లేవు. కొంత కాలంగా బయట కనిపించడమే మానేసిన రాజశేఖర్ తన కొత్త సినిమా ఫస్ట్ పోస్టర్లో ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో చూడాలి. రాజశేఖర్కు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టినవి పోలీస్ క్యారెక్టర్లే. తన రీఎంట్రీకి కూడా ఆయన పోలీస్ స్టోరీనే ఎంచుకున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడట. బహుశా ఆ లుక్ లోనే ఫస్ట్ పోస్టర్ ఉండొచ్చేమో. ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

,  ,  ,  ,