Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2017 12:38:20
facebook Twitter Googleplus
Photo

కొన్నేళ్ల కిందట ఆయన రెండు మూడు నెలల పాటు ఫారిన్లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఇక గత ఏడాది సైతం రజినీ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అమెరికాలో ట్రీట్మెంట్ జరిగింది. అప్పుడు ఆయన అమెరికా పర్యటన రెండు నెలల పాటు సాగింది. ఆ సమయంలో రజినీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఒక దశలో రజినీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిందని.. ఇక ఆయన సినిమాలు చేయడమూ కష్టమే అని ప్రచారం జరిగింది. ఐతే కబాలి విడుదలకు ముందు రజినీ తిరిగి ఇండియాకు వచ్చాడు. తర్వాత 2.0 షూటింగ్ లోనూ పాల్గొన్నారు.

ఐతే ఇప్పుడు రజినీ మరోసారి అనారోగ్యంతో అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన చిన్న కూతురు సౌందర్యను వెంటబెట్టుకుని అమెరికా పర్యటనకు వెళ్లారట రజినీ. ఒంట్లో నలతగా ఉండటం వల్లే రజినీ అమెరికా వెళ్లారని కొందరంటుంటే.. గత ఏడాది జరిగిన చికిత్సకు సంబంధించి రివ్యూ కోసమే వెళ్లారని ఇంకొందరంటున్నారు. త్వరలోనే రాజకీయ అరంగేట్రానికి రజినీ రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కూడా రజినీ అమెరికాకు వెళ్లి ఉండొచ్చంటున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెడితే.. బయట తిరగాలి. మీటింగులు పెట్టాలి. జనాల్ని కలవాలి. తీరిక లేకుండా పని చేయాలి. ఈ వయసులో రజినీకి ఇది సవాలే. మరి ఒకటికి రెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురైన రజినీ.. మున్ముందు ఆరోగ్యం విషయంలో ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి

,  ,  ,  ,  ,