Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Aug-2017 12:19:35
facebook Twitter Googleplus
Photo

మహేశ్ బాబు ఇప్పుడు స్పైడర్ సినిమాను ఆల్రెడీ పూర్తి చేసేసి ఉత్తర్ ప్రదేశ్ లో భరత్ అను నేను సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. అయితే మరో ప్రక్కన సెప్టెంబర్ 9న చెన్నయ్ లో మహేష్ లాంచ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏ ఆర్ మురుగుదాస్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా ఈవెంట్ కోసం.. మరో సూపర్ స్టార్ రానున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.

స్పైడర్ సినిమా తెలుగు - తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. మహేశ్ బాబు ఈ చిత్రానికి తమిళంలో డబ్బింగ్ కూడా చెప్పాడు. అందుకే ఈ సినిమాను తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ తమిళ లాంచ్ కార్యక్రమానికి ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తున్నరానే టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ - దర్శకుడు శంకర్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారట. అందులోనూ రజనీ నటించిన 2.0 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థే.. స్పైడర్ థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకుంది కాబట్టి.. ఖచ్చితంగా రజనీ వస్తారని అంటున్నారు.

మురుగదాస్ డైరక్షన్లో రూపొందిన స్పైడర్ ను ఠాగూర్ మధు రూపొందించారు.

,  ,  ,  ,  ,  ,