Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-May-2016 14:06:26
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ నటించిన ?కబాలి? సినిమా టీజర్ ఇప్పుడు మరో రికార్డు సృష్టించింది. ?కబాలి? సినిమా ఫస్ట్ టీజర్‌ను మే ఒకటి న నిర్మాత కలై పులి ధాను విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్ విడుదల అయిన 22 గంటల్లో రికార్డు స్థాయిలో 50 లక్షల మంది ఈ ట్రైలర్ ని చూడగా ఇప్పుడు కబాలి టీజర్ మరో రికార్డు సాధించింది.
టీజర్ విడుదలైన ముప్ఫైరోజుల్లో రికార్డు స్థాయిలో రెండుకోట్లమంది పైగా ఈ టీజర్ ని చూశారు. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు టీజర్ ని ఇప్పటివరకూ మూడు లక్షలమందికి పైగా చూశారు. ఓ డబ్బింగ్ సినిమా ట్రైలర్ ని ఇంతమంది చూడటం ఇదే ప్రధమం. ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిపేందుకు ఇవి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రజనీ మాఫియా డాన్ గా నటిస్తోన్న ఈ సినిమా కి పా రంజిత్ దర్శకత్వం వహించగా, ఈ సినిమా జులై 1 న విడుదల అవుతున్నది.

,  ,  ,  ,  ,  ,  ,