Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2016 13:14:00
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఫుల్ జోష్ తో వచ్చేశారు. హెల్త్ చెకప్స్ కోసం రోబో సీక్వెల్ 2.0 బ్రేక్ వేసి మరీ అమెరికా వెళ్లిన రజినీ.. రీసెంట్ గానే ఇంటికి తిరిగొచ్చేశారు.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దీపావళి పండుగ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు తగినంత రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయిన రజినీ.. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా 2.0 షూటింగ్ కి అటెండ్ అయిపోనున్నారు.

నవంబర్ 5న రోబో సెట్స్ లో జాయిన్ కానున్న రజినీకాంత్.. ఈ సారి రెట్టించిన వేగంతో పని చేసేలా ప్లాన్ చేసుకున్నారట. ముందు నిర్ణయించిన షెడ్యూల్స్ కొంత డిస్టర్బ్ కావడంతో.. వాటిని కూడా కవర్ చేసేయనున్నారని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ ని ఫినిష్ చేసేందుకు రజినీకాంత్ ఎంతగా ఫిక్స్ అయ్యారంటే.. ఈ సారి సినిమాలో తన వంతు భాగం షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకూ బ్రేక్ కూడా తీసుకోరట.

350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 2.0 పై అంచనాలు చాలానే ఉన్నాయి. వీటిని అందుకునేందుకు టీమ్ మొత్తం బోలెడంత కష్టపడుతోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి.. నవంబర్ 20న ఫస్ట్ లుక్ రిలీజ్ ను ముంబైలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

,  ,  ,  ,