Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jul-2016 11:36:47
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్ విదేశీ పర్యటనను ముగించుకొని నిన్ననే ఇండియాకి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ?కబాలి? సినిమా విడుదల రోజున కూడా ఆయన అమెరికాలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న నేపథ్యంలో రజనీ, అభిమానులకు, ప్రేక్షకులకు తనకు అండగా నిలబడ్డ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత కొద్దికాలంగా రోబో 2.0, కబాలి సినిమాలతో బిజీగా ఉండడంతో కాస్త విశ్రాంతి కోరుకున్నానని, అందుకే కొద్దిరోజుల పాటు అమెరికా వెళ్ళి వచ్చానని ఈ సందర్భంగా రజనీ స్పష్టం చేశారు. ?అమెరికాలో కొద్దిరోజులు గడిపాక ఇక్కడికి తిరిగి రావడంతోనే ?కబాలి?పై మీరందరూ ఎంత ప్రేమ కురిపిస్తున్నారో తెలుసుకున్నా. నాకు అండగా నిలబడ్డ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా? అని తెలుపుతూ రజనీ తన స్వహస్తాలతో ఓ లేఖ రాసి విడుదల చేశారు. ఇక కబాలి సినిమా విషయానికి వస్తే, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌నే తెచ్చుకున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

,  ,  ,  ,  ,