Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2017 11:22:03
facebook Twitter Googleplus
Photo

భారత క్రికెటర్లు.. అభిమానులకు సచిన్ రమేష్ టెండూల్కర్ ను దేవుడు అనడంలో డౌట్స్ ఉండవు. ఇప్పుడు సచిన్ జీవిత గాధపై ఓ బయోపిక్ రూపొందుతోంది. సచిన్ - ఏ బిలియన్ డ్రీమ్స్'అనే టైటిల్ పై రూపొందిన ఈ చిత్రం.. మే 25న విడుదల కానుంది. సచిన్ చిన్ననాటి జీవితం.. క్రికెటర్ గా ఎదిగిన తీరు.. సాధించిన ఘనతలు.. వీటన్నిటినీ ఈ చిత్రంలో చూపబోతున్నారు.

సచిన్ మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా.. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ బెస్ట్ విషెస్ చెప్పారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మాస్టర్ బ్లాస్టర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 'డియర్ సచిన్.. సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశారు. దీనికి థ్యాంక్యూ తలైవా. మీరు ఈ సినిమాను తమిళ్ లో ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా అంటూ రిప్లై ఇచ్చాడు సచిన్.

సచిన్ బయోపిక్ హిందీతో పాటు.. ఇంగ్లీష్.. హిందీ.. తెలుగు.. తమిళ్.. మరాఠీ భాషల్లో కూడా విడుదల కానుంది.

,  ,  ,  ,  ,