Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-May-2015 11:16:34
facebook Twitter Googleplus
Photo

అందరూ చెప్పుకుంటూ వుండే క్రేజ్ .. ఇమేజ్ అనేవి ఏవైతే వున్నాయో, వాటికి నిలువెత్తు కొలమానమే రజనీకాంత్. దశాబ్దాలుగా వెండితెరపై కథానాయకుడిగా ఆయన సృష్టిస్తూ వస్తోన్న సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా రజనీ విలన్ గా కనిపించనున్నాడనే వార్తలు కోలీవుడ్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆయనలా కనిపించేది 'రోబో 2' సినిమా కోసం అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే రజనీ విలన్ గా కనిపించేది హిందీ వెర్షన్లో మాత్రమేనని తెలుస్తోంది. హిందీ రోబోలో కథానాయకుడు షారూఖ్ ఖాన్ కాగా విలన్ గా రజనీ చేస్తాడట.

ఇక తమిళ్ వెర్షన్లో రజనీ కథానాయకుడు కాగా, షారూఖ్ విలన్ అని అంటున్నారు. ఈ తమిళ్ వెర్షనే తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తుంది. మార్కెట్ పరంగానే కాదు, రజనీ . . షారూఖ్ ల మధ్య సాన్నిహిత్యం కూడా ఈ మార్పుకి కారణమని అంటున్నారు. ఏదేవైనా ఇది ఒక ప్రయోగమేననీ, ఇది విజయవంతమైతే మున్ముందు ఇది సక్సెస్ ఫార్మూలా కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,