Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Aug-2017 13:21:19
facebook Twitter Googleplus
Photo

మొన్నటివరకు చేతినిండా సినిమాల్లేవ్.. వచ్చిన సినిమాలు ఫ్లాపయ్యాయ్. విక్కీ డోనర్ రీమేక్ గా వచ్చిన నరుడా డోనరుడా కూడా ఫ్లాపు కావడంతో సుమంత్ పరిస్థితి కష్టమే అనుకుంటే.. మనోడు మాత్రం కామ్ గా వచ్చి ఒక సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేసి.. ఈరోజు సింపుల్ గా టీజర్ కూడా దించేశాడు.

కొత్త కుర్రాడు గౌతమ్ తిన్ననూరి డైరక్షన్లో సుమంత్ హీరోగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా రూపొందిన సినిమా మళ్లీ రావే. ఈరోజు ఈ సినిమా టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. 13 ఏళ్ల క్రితం స్నేహితురాలైన ఒక అమ్మాయిని తిరిగి కలిస్తే.. చూసి కూడా పట్టనట్టుగా వెళ్ళిపోయింది. గుర్తు పట్టలేదా? గుర్తు పెట్టుకోలేదా? అంటూ సుమంత్ చెప్పే డైలాగుతో ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనే అనిపిస్తోంది. సుమంత్ కూడా ఇలాంటి క్లాస్ కంటంట్ తో సినిమాలు చేస్తే అవి ఖచ్చితంగా హిట్టవుతాయి అనే నమ్ముతున్నారు అక్కినేని అభిమానులు. మరి మళ్ళి రావే అంటూ మళ్ళీ వచ్చిన సుమంత్ కు ఈ సినిమాతో ఎలాంటి ఫేట్ దక్కుతుందో చూడాలి.

ఇప్పటికే సుమంత్ తో పాటు కెరియర్ మొదలుపెట్టిన హీరోలు స్టార్ హీరోలు అయిపోతే.. స్టార్ అవ్వడానికి అన్ని క్వాలిటీస్ ఉన్న సుమంత్ మాత్రం సైలెంట్ అయిపోయాడు.

,  ,  ,  ,  ,