Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Nov-2016 10:58:37
facebook Twitter Googleplus
Photo

తెలుగులో పూరి జగన్నాథ్ లాంటి స్టార్ దర్శకుడి సినిమాతో కథానాయికగా పరిచయం కావాల్సింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ పూరి ఇచ్చిన ఆఫర్ ను కొన్ని కారణాల వల్ల తిరస్కరించినట్లు రకుల్ తర్వాత వెల్లడించింది. ఐతే రకుల్ తనకు తెలియకుండానే ఇంతకుముందు మురుగదాస్ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందట. ఆ సంగతి ప్రస్తుతం మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సందర్భంగా తెలిసిందంటోంది రకుల్. విజయ్ హీరోగా మురుగదాస్ తీసిన ?తుపాకి? సినిమాకు హీరోయిన్ గా రకుల్ ప్రీత్ నే అనుకున్నారట. కానీ రకుల్ తన ప్రమేయం లేకుండా ఆ ఛాన్స్ మిస్సయిందట.

ఓ కమర్షియల్ యాడ్లో రకుల్ ప్రీత్ ను చూసిన మురుగదాస్ ఆమెను ?తుపాకి? సినిమాకు కథానాయికగా తీసుకుందామని.. యాడ్ ఏజెన్సీని సంప్రదించాడట. ఐతే ఆ యాడ్ ఏజెన్సీ వాళ్లు రకుల్ కు సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని చెప్పడంతో మురుగదాస్ సైలెంటైపోయాడట. అలా రకుల్ తనకు తెలీకుండానే మురుగదాస్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయిందట. ఈ సంగతి మురుగదాసే స్వయంగా మహేష్ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు చెప్పినట్లు రకుల్ వెల్లడించింది. ఐతే మురుగదాస్ దర్శకత్వంలో నటించాలన్నది తన కల అని.. ఇంతకుముందు తన డీటైల్స్ మురుగకు ఈమెయిల్ కూడా చేశానని.. ఐతే ఎలాగోలా ఇప్పుడు తన కల నెరవేరుతోందని సంతోషం వ్యక్తం చేసింది రకుల్.

,  ,  ,  ,