Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 14:41:12
facebook Twitter Googleplus
Photo

గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమయ్యే ఆలోచన తనకు లేదని చెబుతోంది రకుల్‌ప్రీత్‌సింగ్. పాత్రల పరంగా ప్రతి సినిమాలో వైవిధ్యతకు ప్రాధాన్యతనివ్వడానికే ప్రయత్నిస్తానని అంటోంది.
కెరీర్ తొలినాళ్ల నుంచి కమర్షియల్ చిత్రాలతో ప్రతిభను చాటుతోన్న ఆమె అగ్రకథానాయికల్లో ఒకరిగా గుర్తింపును తెచ్చుకుంది. తన అందచందాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న రకుల్ గ్లామర్ క్వీన్ అనే ముద్రను సొంతం చేసుకుంది. అయితే కొన్ని చిత్రాల్లో గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన తనపై గ్లామర్ తార అనే ముద్ర వేయడం సరికాదని చెబుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ప్రతిభకు గ్లామర్ ఒక్కటే ప్రామాణికం కాదు. గ్లామర్‌గా ఉన్నవాళ్లకు మాత్రమే అవకాశాలు వస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమే. కేవలం గ్లామర్‌ను నమ్ముకుని నేను సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. అందానికి నటనా ప్రతిభ, హార్డ్‌వర్క్ తోడవటం వల్లే కథానాయికగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగాను. గ్లామర్‌కు తావు లేని నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాను. ఆ పాత్రల వల్లే నటిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. భవిష్యత్‌లో కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడానకే ఇష్టపడతాను. హృద్యమైన ప్రేమకథలతో పాటు క్రీడా నేపథ్యమున్న చిత్రాల్లో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.

,  ,  ,  ,  ,  ,