Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 14:00:38
facebook Twitter Googleplus
Photo

రీసెంట్ టైంలో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ ఎవరంటే రకుల్ ప్రీత్ సింగ్ పేరే చెప్పాలి. అసలు ఈ రేంజ్ లో ఉండడానికి ప్రధాన కారణం రకుల్ ప్లానింగే అంటారు చాలామంది. రీసెంట్ గా హైద్రాబాద్ లో కోటి రూపాయలు ఖర్చు చేసి ఓ ఇల్లు కొనుక్కుని పర్మనెంట్ గా సెటిల్ అయిపోయిన రకుల్ ప్రీత్.. ఇక్కడ ఓ బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసింది.

హైద్రాబాద్ గచ్చిబౌలిలో ఎఫ్45 అనే ఓ జిమ్ సెంటర్ ను ప్రారంభించింది రకుల్. ఈ ఫ్రాంచైజీకి టోటల్ గా ఓనర్ రకుల్ ప్రీత్ అని తెలుస్తోంది. కాస్ట్లీ ఏరియిలా అంతకంటే లగ్జరీగా స్టార్ట్ చేసిన ఈ జిమ్ సెంటర్ బాగానే నడుస్తోంది. బిజినెస్ కూడా బాగానే వర్కవుట్ అవుతోందంటున్నారు. ఈ విషయాన్ని వాళ్లూ వీళ్లూ కాదు.. రకుల్ స్వయంగానే చెబుతోంది. 'ప్రస్తుతం మా జిమ్ అండ్ ఫిట్ నెస్ సెంటర్ లో 100మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. త్వరలో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. ఈ స్పీడ్ లో కస్టమర్స్ వస్తారని నేను అనుకోలేదు. ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎఫ్45కు కొత్త మెంబర్లు ఈ సంఖ్యలో లేరు'అంటోంది రకుల్.

తన వ్యాపారం నడుస్తున్న తీరు చాలా సంతోషాన్ని ఇస్తోందంటున్న రకుల్ ప్రీత్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జంటగా నటించిన సరైనోడు కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాలో మహాలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి రోల్ చేసిన రకుల్.. రియల్ లైఫ్ లో మహాలక్ష్మిని ఇంటికి తెచ్చుకునేందుకు మంచి మంచి ఐడియాలే వేస్తోంది.

,  ,  ,  ,  ,