Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Sep-2016 14:59:52
facebook Twitter Googleplus
Photo

విశాల్ సినిమా అన‌గానే హీరోయిన్లు పండ‌గ చేసుకొంటున్నారు. మంచి పాత్ర‌లు ద‌క్కుతాయ‌నో, విశాల్ లాంటి గొప్ప న‌టుడి ప‌క్క‌న న‌టిస్తున్నామ‌నో కాదు?. అడిగినంత పారితోషికం ఇస్తార‌ని. నిజం చెప్పాలంటే విశాల్ డీ గ్లామ‌రైజ్డ్ హీరో. కాని, ఆయ‌న ప‌క్క‌న మాత్రం అదిరిపోయే భామ‌లు ద‌ర్శ‌న మిస్తుంటారు. దానికి కార‌ణం.. క‌థానాయిక‌లు అడిగినంత పారితోషికం అందిస్తాడ‌ని టాక్.

ఇప్పుడు హీరోయన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా విశాల్ ఇచ్చే రేమ్యునిరేషన్ కి ఫ్లాట్ అయిపోయింది. విశాల్‌ తాజా చిత్రం ?కత్తిసండై?విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత మిష్కిన్‌ దర్శకత్వంలో ?తుప్పరివాళన్‌?అనే టైటిల్ తో ఓ సినిమా చేయనున్నాడు విశాల్. ఇందులో కథానాయికగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంచుకున్నారు.

ప్రస్తుతం మహేష్ , రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్ తో నటిస్తూ.., క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రకుల్.. విశాల్ ఆఫర్ ను తొలుత లైట్ తీసుకొంది. అయితే ఇక్కడ విశాల్ కళ్ళు చెదిరిపోయే రేమ్యునిరేషన్ ని ఆఫర్ చేశాడట. ఇప్పటివరకూ రకుల్ కు ఇంత రేమ్యునిరేషన్ రాలేదట. ఆ రెమ్యునిరేషన్ ఎంతో గానీ.. దాదాపు మూడు పెద్ద సినిమాలు చేసినా అంతటి రెమ్యునిరేషన్ రాదట. దీంతో మారుమాట లేకుండా డేట్లు సర్దేసిందట రకుల్. ఈ చిత్రానికి విశాలే నిర్మాత.

,  ,  ,  ,  ,