Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Feb-2016 14:30:27
facebook Twitter Googleplus
Photo

ఈ తరం హీరోయిన్లు గ్లామర్ షోకి మినహాయించి.. పెర్ఫామెన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదన్న కామెంట్ చాలావరకూ నిజమే. రెమ్యూనరేషన్ లో బంపర్ ఆఫర్ ఇస్తే.. హీరో ఎవరన్నది కూడా పట్టించుకోకుండా స్టార్ హీరోయిన్లు కూడా ఆడి పాడేస్తున్నారు. ఇంకాస్త ఎక్కువిస్తే ఐటెం సాంగ్స్ కూడా చేసేస్తున్నారు. కానీ వీళ్లు చెప్పే మాటలు మాత్రం మరోలా ఉంటాయ్. చిరకాలం నిలిచిపోయే పాత్రలు చేసేసి.. తమలో నటిని బయటకు తీసుకురావాలని ఉన్నా.. అలాంటి గొప్ప ఆఫర్స్ రావడం లేదని అంటూ ఉంటారు భామలు.

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం నేను అందరిలాంటి దాన్ని కాదని అంటోంది. 'నాకు కుంటి సాకులు చెప్పడం రాదు. నేనో పెద్ద నటి అని నిరూపించుకునేందుకు ఇండస్ట్రీలోకి రాలేదు. నాకంటే హేమాహేమీలు బోలెడు మంది ఇక్కడ ఉన్నారు. ఏదో ఉన్నంత సేపూ అందంగా కనిపించాలి. ఈ రోల్ ని రకుల్ చెడగొట్టలేదు అనిపించుకుంటే చాలు' అని చెప్పిందీ భామ.

తనకు పెద్ద లక్ష్యాలేం లేవని.. పాత్రని చెడగొట్టదు అన్న పేరు చాలని చెప్పిన రకుల్.. మరే విషయం గురించి ఆలోచించదట. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రంలో చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో తర్వాత ఈ ఏడాది రెండో హిట్ పై కన్నేసింది.

,  ,  ,