Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jun-2015 16:55:23
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ డేట్స్ సమస్య కారణంగా మహేశ్ బాబు సరసన నటించే ఛాన్సును మిస్సయిన సంగతి మనకు విదితమే. ఈ క్రమంలో మరో స్టార్ హీరో అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశాన్ని అందుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా రకుల్ ని అడుగుతున్నట్టు సమాచారం. ఆమె కూడా ఈ ఆఫర్ కి సానుకూలంగా స్పందించి డేట్స్ అడ్జస్ట్ చేస్తోందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది!

,  ,  ,