Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 10:56:39
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయాన్ని.. ల్యాండ్ మార్క్ మూవీగా చారిత్రాత్మక చిత్రాన్ని ఎంచుకుని చరిత్ర సృష్టించడాన్ని.. పురస్కరించుకుని.. ఆయనకు ఘనసన్మానం నిర్వహించారు టీ సుబ్బిరామిరెడ్డి. ఈ కార్యక్రమానికి మిల్కీ బ్యూటీ కూడా హాజరు కావడం చాలా రకాల ప్రశ్నలను రేకెత్తించింది.

బాలయ్య ఫంక్షన్ కు మిల్కీ హాజరు కావడంపై చాలా రకాల రూమర్స్ వచ్చేస్తున్నాయి. వీటిన్నిటికీ చెక్ పెట్టేస్తూ.. తమన్నా డైరెక్ట్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. 'నేను రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారితో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను. అంతేకాదు.. క్రిష్ దర్శకత్వంలో మూవీ చేయాలని ఉంది' అంటూ ఓపెన్ గానే చెప్పేసింది తమ్మూ. ఇలా సీనియర్ హీరోతో చేయాలని ఉందని ఓ స్టార్ హీరోయిన్ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా అరుదు అనే చెప్పాలి. ఈ విషయంలో అమ్మడి ధైర్యాన్ని అందరూ పొగిడేస్తున్నారు.

మరోవైపు.. ఇప్పటివరకూ స్టార్ హీరోయిన్లను తన సినిమాల్లో ఎంపిక చేసేందుకు బాలయ్యకు కొంత క్లిష్టంగా ఉండేది. కానీ గౌతమిపుత్ర శాతకర్ణితో ఆయన సాధించిన ఘనవిజయం తర్వాత.. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసేందుకు స్టార్ హీరోయిన్సే ముందుకు వస్తుండడం విశేషం.

,  ,  ,  ,