Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2017 10:42:35
facebook Twitter Googleplus
Photo

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మంచి ఫామ్ లోనే ఉంది. దసరాకు రిలీజ్ అయిన స్పైడర్ మూవీ డిజప్పాయింట్ చేయడం అనే ఒక్క పాయింట్ మినహాయిస్తే.. అమ్మడి కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. స్పైడర్ సక్సెస్ అయితే.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేద్దామని భావించగా.. ఆ చిత్రం నిరుత్సాహపరిచింది.

అయితే.. స్పైడర్ ప్రమోషన్స్ విషయంలో రకుల్ ప్రీత్ చాలా పద్ధతిగా కనిపించింది. గ్లామర్ డాల్ ఇమేజ్ చాలానే ఉన్నా.. సినిమాలో కూడా పెళ్లి కాకుండా ఓ బ్లైండ్ డేట్ కోసం తపన పడే అమ్మాయిగా నటించినా.. ప్రమోషన్స్ లో మాత్రం కొంచెం కూడా గ్లామర్ ఒలకబోయలేదు. ఇప్పుడు కాస్త స్టేటస్ పెరిగింది కాబట్టి.. పైగా మహేష్ మూవీ అంటే ఫ్యామిలీ అంతా గమనిస్తూ ఉంటారు కాబట్టి.. గ్లామర్ షోకి దూరంగా ఉందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు కార్తీ నటించన తీరన్ అధికారం ఒండ్రు చిత్రం రిలీజ్ కానుంది. తెలుగులో ఖాకీ పేరుతో ఈ చిత్రం విడుదల కానుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం గ్లామర్ ఒలకబోసేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

ఒక సినిమా విషయంలో కాసింత తేడా జరగ్గానే.. తర్వాతి మూవీకి అమ్మడిలో వచ్చిన ఛేంజ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎంతయినా హీరోయిన్ గ్లామర్ కూడా క్రౌడ్ పుల్లింగ్ కాన్సెప్టే. స్పైడర్ విషయంలో ఇలాంటివి పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమాలో కూడా ఈమె పెద్దగా చేసేదేం లేదు. కానీ ఖాకీ సంగతి అలాకాదు.

,  ,  ,  ,  ,