Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2017 11:59:36
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే మరో మాట లేకుండా మెగాస్టార్ చిరంజీవి అని చెప్పేసేవాళ్లు. ఎందుకంటే డ్యాన్స్ విషయంలో ఆయనకు దరిదాపుల్లో ఎవరూ నిలిచేవాళ్లు కాదు. కానీ కొత్త జనరేషన్ విషయానికి వస్తే మాత్రం ఇలా ఏ ఒక్కరినో బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పే పరిస్థితి లేదు. ఈ విషయమై ఎవరినైనా అడిగితే.. సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతారు. అందరూ బెస్టే అని సమాధానం దాటవేస్తారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. ప్రధానంగా ఈ ముగ్గురిలో ఎవరు ఎవరికీ తీసిపోరు. ముగ్గురూ డ్యాన్సుల్లో ఇరగదీస్తారు. ఐతే ఈ ముగ్గురితోనూ పని చేసిన రకుల్ ప్రీత్.. వీరిలో ‘ది బెస్ట్’ ఎవరో చెప్పేయడం విశేషం.

రకుల్ ప్రీత్ దృష్టిలో ఎన్టీఆరే బెస్ట్ డ్యాన్సరట. అల్లు అర్జున్.. రామ్ చరణ్ లను తక్కువ చేయకుండానే డ్యాన్స్ విషయంలో ఎన్టీఆర్ ప్రత్యేకత ఏంటో చెప్పింది రకుల్. ఎన్టీఆర్ ఏ డ్యాన్స్ మూమెంట్ అయినా సరే.. డ్యాన్స్ మాస్టర్ చేసి చూపిస్తే దాన్ని చూపులతోనే పట్టేసి నేరుగా స్టెప్ వేసేస్తాడని.. అతడితో డ్యాన్స్ అంటే తనకు చాలా ఇబ్బంది చెప్పింది రకుల్. అందుకే ఎన్టీఆర్ కు స్టెప్ చూపించడానికి ముందే తనకు నేర్పిస్తే రిహార్సల్స్ చేసుకుంటానని డ్యాన్స్ మాస్టర్లను అడుగుతుంటానని రకుల్ తెలిపింది. ఇక అల్లు అర్జున్.. రామ్ చరణ్ ల విషయానికి వస్తే.. వాళ్లు ఒకసారి రిహార్సల్స్ చేసిన తర్వాత టేక్ కు వెళ్తుంటారని రకుల్ తెలిపింది.

,  ,  ,  ,  ,  ,