Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2017 13:07:19
facebook Twitter Googleplus
Photo

డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్.. రివ్యూలపై రివ్యూ రైటర్లపై కాసింత సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆల్రెడీ డిజె సినిమాకు రివ్యూయర్లు నెగెటివ్ రేటింగులు ఇచ్చినా కూడా కలక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతోంది అని చెబుతున్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు రివ్యూయర్లు మన కమర్షియల్ సినిమాకు గౌరవం ఇవ్వాలని అంటున్నాడు. తమ ఛార్టెడ్ ఫ్లయిట్ చికాగో నుండి బే ఏరియాకు వెళుతున్న వేళ.. టివి5 రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ సంచలన కామెంట్స్ చేశాడు బన్నీ. పదండి చూద్దాం.

సినిమా అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ కు రేటింగ్ ఏంటి? మీ మథర్ అంటే మీకు ఎంతిష్టం.. దానికి రేటింగ్స్ ఇవ్వండి అంటే ఇస్తారా? రివ్యూ రాయాలి అంటే సదరు పర్సన్ ఒక ఇంటలెక్చువల్ అవ్వాల్సిందే. వారే రాయగలుగుతారు. అయితే వారి ఒక్క వ్యూ పాయింట్ అందరికీ ఈక్వేట్ చేయడం పద్దతి కాదు. అమెరికా వాళ్ళ అందరికీ మీకు ఇలాగే నచ్చుద్ది.. ఇన్ని స్టార్లు ఇస్తేనే చూడండి అనడం తప్పు'' అన్నాడు అల్లు అర్జున్. మరి మీ గత సినిమాల టైములో రివ్యూల గురించి ఇలా మాట్లాడలేదు కదా అంటే.. ''అప్పుడు సినిమా ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు మాత్రం కేవలం రివ్యూలే కనిపిస్తున్నాయి. అందుకే మాట్లాడాల్సి వస్తోంది అంటున్నాడు.

ఇక కమర్షియల్ సినిమాను గౌరవించడం లేదని చెబుతూ.. రివ్యూ రైటర్లలో చాలామందికి కమర్షియల్ సినిమాపై గౌరవం లేదు. కమర్షియల్ సినిమా అంటే ఒక మల్టీ-జానర్ మూవీ. డ్యాన్స్ అంటే మ్యూజిక్ జానర్.. ఫైట్లు అంటే యాక్షన్ జానర్.. లవ్ అంటే రొమాన్స్ జానర్.. ట్విస్ట్ అంటే థ్రిల్లర్ జానర్.. సెంటిమెంట్ అంటే డ్రామా జానర్.. ప్రపంచంలో ఏ సినిమాలోనైనా ఇన్నేసి జానర్లు ఉంటాయా? కేవలం మన సౌత్ ఇండియా సినిమాల్లో మాత్రమే ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాత టైటానిక్ లో కూడా రొమాన్స్ డ్రామా రెండే జానర్లు ఉన్నాయి. అందుకే మన బాహుబలి అంత పెద్దగా వరల్డ్ వైడ్ ఎప్రీషియేషన్ తెచ్చుకుంది. అన్నేసి జానర్లు చూసి ఫారినర్లు షాకైపోతున్నారు. కాని మనం మాత్రం మన ప్రత్యేక మల్టీ-జానర్ ను గొప్పగా చెప్పుకోకపోవడం మన దరిద్రం. దానిని అభాసుపాలు చేస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అల్లు అర్జున్.

ఎవడో తెల్లోళ్ళలా తీస్తే గొప్ప సినిమా.. ఒక్క జానర్ లో తీస్తేనే గొప్ప సినిమా.. లేదంటే ఫోటోగ్రాఫి బాగుంటే గొప్ప సినిమా.. కాదు. మన ఇండియన్స్ ఒక సింగిల్ డిష్ తో భోజనం చేయం. మనకు స్వీటు హాటు డ్రింకు బిర్యాని అన్నీ కావాలి. సో మన సినిమాలు కూడా అలాగే ఉంటాయి. మనం మల్టీ-జానర్ సినిమాను ప్రమోట్ చేయాలి. మన గురించి మనం చెప్పుకోవాలి ప్రపంచానికి. చాలామంది ఫారినర్లు మన సినిమాల్లో ఉండే డ్యాన్సులు ఫైట్లు గురించి గొప్పగా నాకు చెప్పారు

,  ,  ,  ,  ,