Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2016 12:19:32
facebook Twitter Googleplus
Photo

2016లో ఏకంగా 50 కోట్ల క్లబ్బులో ఉన్న మూడు సినిమాలు. ఒకప్పుడు సమంత కూడా రిపీట్ చేయలేకపోయిన ఫీట్ ను చేసేసింది సెక్సిణి రకుల్ ప్రీత్ సింగ్. నాన్నప్రేమతో.. సరైనోడు.. ధృవ సినిమాల్లో తన గ్లామర్ తో రచ్చ చేయడమే కాదు.. తన యాక్టింగ్ టాలెంట్ తో కూడా ఆకట్టుకుని అసలు సిసలైన స్టార్ హీరోయిన్ అనిపించుకుంది అమ్మడు. ఈ సందర్భంగా అసలు రకుల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

''అసలు ఈ ఇయర్ లో ఏం సాధించాను అంటూ వెనక్కి తిరిగి మాత్రం చూసుకోను. నాది ఒక స్పోర్ట్స్ మెన్ తరహా వ్యక్తిత్వం. ఈ మ్యాచ్ లో గెలవచ్చు..కాని వేరే మ్యాచ్ లో ఓడిపోవచ్చు. ఒక రౌండు నెగ్గాం అని పండగ చేసుకుంటే.. రెండో రౌండ్ ఓడిపోయే ఛాన్సుంది. నా వరకు నేను అన్ని సినిమాలకూ 100% ఎఫర్ట్ పెడుతున్నాను. రిజల్ట్ గురించి ఫీలవ్వక్కర్లేదు. అలాగే సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవక్కర్లేదు'' అంటూ వేదాంతం చెప్పేసింది రకుల్ ప్రీత్ సింగ్.

సరే ఒక సంవత్సరం వెనక్కి చూడవ్.. ముందుకైనా చూస్తావా అంటే.. ''ఎందుకు చూడనూ.. చూస్తాను. ఫుల్లుగా ఎప్పుడూ వర్క్ చేయకుండా.. ఈ సంవత్సరం కనీసం సండేస్ అయినా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇదే విషయం మా మేనేజర్ కు చెబితే.. జూన్ నుండి సండేలు రెస్ట్ ఇచ్చేద్దాంలే అంటున్నాడు. అంటే ఆల్రెడీ సగం సంవత్సరానికి మళ్లీ రెస్ట్ లేదన్నమాట'' అంటూ నవ్వేసిందీ సరైన లేడీ!!

,  ,  ,  ,  ,